26-08-2025 06:11:06 PM
కుమ్రం భీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): అన్నం పెట్టే అన్నదాతకు యూరియా ఇవ్వడానికి కండిషన్లు పెట్టడమా అని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి చిరంజీవి ప్రశ్నించారు.మంగళవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగానే రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు.రైతులకు సరిపడా ఎరువులను అందించాలన్న ముందస్తు ఆలోచన లేకుండా ప్రభుత్వాలు ఎలా వ్యవహరిస్తాయని ప్రశ్నించారు. రైతులు యూరియా కోసం రోజుల తరబడి పడి కాపులు కాస్తే పంటలు ఎప్పుడు పండిస్తారని ప్రశ్నించారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా కనువిప్పు కలిగి వెంటనే రైతులకు సరిపడా యూనియన్ అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు.