24-10-2025 05:26:21 PM
బెల్లంపల్లి,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మాజీ మండల పరిషత్ అధ్యక్షులు గోమాస శ్రీనివాస్ ను కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారనే వదంతులు వినిపిస్తున్నాయి. గురువారం సాయంత్రం బెల్లంపల్లి ప్రాంతంలో నెంబర్ ప్లేట్ లేని వాహనంలో వచ్చిన కొంతమంది గోమాస శ్రీనివాస్ ను కిడ్నాప్ చేశారని తెలుస్తుంది. కిడ్నాప్ కు గురైన మాజీ ఎంపీపీ శ్రీనివాస్ పై రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ లో నకిలీ భూమి పత్రాలు చూపించి డబ్బులు వసూలు చేశారని ఆరోపణపై కొంతమంది ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసుల విచారణ జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో గోమాస శ్రీనివాస్ ను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి ఉంటారేమోనని అనుమానాలు బెల్లంపల్లిలో వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై స్పష్టత రావాల్సి ఉంది.