27-09-2025 02:32:30 PM
మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి..
నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం కృషి చేసిన మహోన్నత వ్యక్తి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అని నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు. 110వ జయంతి సందర్భంగా శనివారం హైదరాబాద్ రోడ్ లోని ఆయన విగ్రహనికి పూలమాలలు వేసి నివాళిలు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం కృషి చేసిన మహోన్నత వ్యక్తి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అని అన్నారు. ఆచార్య జయశంకర్, కొండా లక్ష్మణ్ లు తెలంగాణ రాష్ట్ర రూపకర్తలని, కేసిఆర్ వారి సహాయ సహకారాలతో, సూచనలతో వారు చూపిన బాటలోనే ముందుండి ఉద్యమాన్ని నడిపి ప్రత్యేక తెలంగాణని రాష్ట్రాన్ని సాధించుకున్నారని అన్నారు. సాధించుకున్న, తెలంగాణ రాష్ట్రం కెసిఆర్ నాయకత్వంలో గత పది సంవత్సరాల్లో వారు కన్న కలలను ఎలా నిజం చేసారో, వారు చూసుంటే తప్పకుండా ఆనందపడేవారని అన్నారు.
గత రెండు సంవత్సరాలు గా, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల పట్ల చేస్తున్న నిర్వాకాలు చూస్తుంటే, ఎందుక ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నది అనిపిస్తుందని అన్నారు. మోసపు మాటలతో గద్దెక్కిన కాంగ్రెస్, ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని, ప్రజలకు జరుగుతున్న అన్యాయాలపై రోడ్డు ఎక్కితే వాళ్లపై, అక్రమ కేసులు బనాయిస్తున్నారని, పోలీస్ స్టేషన్లో థర్డ్ డిగ్రీ ప్రయోగించి అమారు పోలీస్ స్టేషన్లో థర్డ్ డిగ్రీ ప్రయోగించి అమానుషంగా ప్రవర్తిస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చీర పంకజ్ యాదవ్, నల్గొండ మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్, పట్టణ పార్టీ అధ్యక్షులు భువనగిరి దేవేందర్, సింగం రామ్మోహన్, కనగల్ మండల పార్టీ అధ్యక్షులు అయితగోని యాదయ్య మాజీ కౌన్సిలర్ మారగొని గణేష్, గుండ్రెడ్డి యుగంధర్ రెడ్డి, ధనుంజయ్, మాజీ ఎంపీపీ బొజ్జ వెంకన్న, కందుల లక్ష్మయ్య, ప్రకాష్, మిరియాల యాదగిరి, మిరియాల స్వామి, గంజి రాజేందర్, పెఱిక కరుణ్ జయరాజ్, వనపర్తి నాగేశ్వరరావు, కంకణాల వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.