19-01-2026 12:00:00 AM
తెలుగు సాహితీవనంలో తొలి కథా పరిమళం బండారు అచ్చమాంబ. ఆమె కేవలం ఒక రచయిత్రి మాత్రమే కాదు.. తెలుగు కథకు ప్రాణం పోసిన ఆదిమూర్తి. 19వ శతాబ్దపు సామాజిక సంకెళ్లను తెంచుకుని, అక్షరా న్ని ఆయుధంగా మలచుకున్న ధీశాలి. ఆమె ౧౮౭౪లో ఇప్పటి నల్లగొండ జిల్లా.. ఒకప్పటి కృష్ణా జిల్లాలోని మునగాల పరగణా మేనేజర్ కొమర్రాజు వెంకటప్పయ్య గంగమ్మ దంపతుల సంతానంగా జన్మించారు.
ఆమె జీవితంలో ఎ క్కువ భాగం తెలంగాణ ప్రాంతంలోనే సాగిం ది. కేవలం ముప్పు ఏళ్లు బతికిన ఆమె కొన్ని శతాబ్దాలకు సరిపడా అక్షర సంపదను తర్వాతి తరాలకు అందించారు. తెలుగులో ఆధునిక కథానిక ప్రక్రియకు అంకురార్పణ చేసిన ఘన త అచ్చమాంబది. గురజాడ అప్పారావు ‘దిద్దుబాటు’ కథ కంటే దాదాపు దశాబ్దం ముందే 1902లో ‘ధన త్రయోదశి’ వంటి కథలను ప్రచురించి ఆమె తెలుగు కథా జగత్తులో సంచలనం సృష్టించారు. స్త్రీ విముక్తిని, సమానత్వా న్ని తన రచనల ద్వారా బలంగా వినిపించిన తొలి తెలుగు స్త్రీవాద రచయిత్రిగా అచ్చమాం బ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు.
బహుభాషా ప్రావీణ్యురాలు
అచ్చమాంబ మేధో వికాసంలో ఆమె సోదరుడు కొమర్రాజు వేంకటలక్ష్మణరావు పాత్ర మ రువలేనిది. తమ్ముడికి పాఠాలు చెప్పడానికి వ చ్చే ఉపాధ్యాయుల వద్ద ఆమె ఏకాగ్రతతో వి ద్యనభ్యసించారు. తెలుగుతో పాటు హిందీ, ఇంగ్లిష్, మరాఠీ, గుజరాతీ వంటి భాషల్లో ప్రా వీణ్యం సంపాదించారు. ఆనాడు సామాజిక సంస్కరణోద్యమాలను నడిపిన కందుకూరి వీరేశలింగం పంతులు ప్రభావం ఆమెపై గా ఢంగా ఉంది. కందుకూరి సంస్కరణాభిలాష ఆమెలోని రచనా తృష్ణను మేల్కొల్పింది. అదేవిధంగా రాజానాయని వెంకట రంగారావు వంటి వారి ప్రోత్సాహం ఆమె సామాజిక దృ క్పథాన్ని విడదీయలేని విధంగా ప్రభావితం చేసింది.
విభిన్న భాషా సాహిత్యాధ్యయనం వల్ల కలిగిన చైతన్యంతో ఆమె భారతీయ స్త్రీల గౌరవాన్ని పెంచేలా ‘అబలా సచ్ఛరిత్ర రత్నమా ల’ వంటి అద్భుత పరిశోధనా గ్రంథాన్ని ఆవిష్కరించారు. స్త్రీల విద్యాహక్కు కోసం అచ్చ మాంబ చేసిన పోరాటం అనన్య సామాన్యం. స్త్రీలు బుద్ధిహీనులని, అబలలని నిందించే పు రుష పక్షపాత వైఖరిని ఆమె నిశితంగా విమర్శించారు. అజ్ఞానానికి కారణం స్త్రీల స్వభావం కాదని, వారికి విద్యావకాశాలు కల్పించని సా మాజిక వివక్షేనని ఆమె ్ల చెప్పారు.
స్త్రీల పక్షాన రచనలు
అచ్చమాంబ తన కథల్లోని పాత్రల ద్వారా మహిళా చైతన్యాన్ని ప్రబోధించారు. ‘దంపతు ల ప్రథమ కలహం’ వంటి కథలో భార్య అంటే దాసి కాదనే ధిక్కార స్వరాన్ని వినిపించి అప్పట్లోనే సంచలనం సృష్టించారు. సాహిత్య సృజ నకే పరిమితం కాకుండా 1902లో మచిలీపట్నంలో ‘బృందావన స్త్రీల సమాజం’ స్థాపించి మహిళా సాధికారతకు ఆచరణాత్మక బాటలు వేశారు. అచ్చమాంబ చూపిన ఈ బాటలో త ర్వాత ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ, కనపర్తి వరలక్ష్మమ్మ వంటివారు నడిచారు. స్త్రీవాద సాహి త్యం వైపు అడుగులు వేస్తున్న ప్రతి రచయిత్రి అచ్చమాంబ అక్షరాలను ఆదర్శంగా తీసుకున్నారు.
కథా ప్రక్రియలో ఆధునికతను, సామా జిక సృ్పహను మేళవించిన ఆమె శైలి నేటికీ ఎందరో కథకులకు మార్గదర్శకంగా ఉంది. అనాథ పిల్లల సేవలో ఉండగానే ప్లేగు వ్యాధి బారిన పడి ఆమె ప్రాణాలు విడిచిన తీరు ఆమె నిస్వార్థ సేవకు నిదర్శనం. తెలుగు సాహిత్య క్షేత్రంలో ఆమె ఒక అలుపెరుగని అక్షర యోధురాలు. ఆమె వదిలి వెళ్లిన సాహిత్య వారసత్వం తెలుగు వారి గుండెల్లో నిరంతరం ప్రకాశిస్తూనే ఉంటుంది.
1900ల ప్రాంతంలో బిలాస్‌పూర్‌లో ప్లేగు వ్యాధి తీవ్రంగా ఉంది. 1905లో అ నాథ పిల్లలకు సేవ చేస్తున్న క్రమంలో ఆమె కు కూడా ఆ వ్యాధి సోకింది. పిల్లల ఆలనాపాలన చూస్తూ, వారి సేవలో ఉండగా ఇదే ఏడాది జ నవరి ౧౮న కన్నుమూశారు. కేవలం ముప్పు ఏ ళ్ల ప్రాయంలోనే ఆమె మరణించడం తెలుగు సాహిత్యానికి, ముఖ్యంగా మహిళా ఉద్యమానికి తీరని లోటు.