21-08-2025 12:06:20 AM
సిద్దిపేట క్రైమ్, ఆగస్టు 20 : గణేష్ నిమజ్జనం జరిగే కోమటి చెరువు ప్రాంతాన్ని సిద్దిపేట ఏసీపీ రవీందర్ రెడ్డి పరిశీలించారు. నిమజ్జనానికి వచ్చే రూట్లో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చూడాలని అధికారులకు సూచించారు. అవసరమైన చోట బారికేడ్లను ఏర్పాటు చేయాలన్నారు. నిమజ్జనం జరిగే ప్రదేశంలో లైటింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు.
అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. మంటపాలకు, నిమజ్జనానికి విగ్రహాన్ని తరలించే సమయంలో ఉత్సవ నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పోలీసుల సలహాలు, సూచనలు పాటించాలని కోరారు. ఏసీపీ రవీందర్ రెడ్డి వెంట మునిసిపల్ కమిషనర్ ఆశ్రిత్ మిశ్రా, వన్ టౌన్ ఇన్స్పెక్టర్ వాసుదేవరావు, మున్సిపల్ ఎలక్ట్రిసిటీ డీఈ, మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్సు, పలు శాఖల అధికారులు, సిబ్బంది ఉన్నారు.