calender_icon.png 5 August, 2025 | 9:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వన్యప్రాణుల సంరక్షణ, మౌలిక సదుపాయాలకు పెద్దపీట

05-08-2025 01:19:44 AM

  1. జీవవైవిధ్య నిర్వహణకు నిపుణుల సిఫార్సులు ఆమోదం
  2. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ బోర్డు 9వ సమావేశంలో కీలక నిర్ణయాలు

హైదరాబాద్, ఆగస్టు 4 (విజయక్రాంతి):   వన్యప్రాణుల సంరక్షణ, వాటి మౌలిక సదుపాయాలకు వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ బోర్డు పెద్ద పీట వేసింది. జీవవైవిధ్య నిర్వహణకు నిపుణులు చేసిన సిఫారస్సులను ఆమోదించిం ది. సోమవారం రాష్ర్ట అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కోండా సురేఖ అధ్యక్షతన, రాష్ర్ట పంచాయతీరాజ్ శాఖ మంత్రి  సీతక్కతో కలిసి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో తెలంగాణ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ బోర్డు 9వ సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో బోర్డు పలు కీలక నిర్ణయాలను తీసుకోనున్నది. అటవీ- జీవవైవిధ్య నిర్వహణను పెంపొందించేందుకు నిపుణులు చేసిన సిఫారసులను బోర్డు ఆమోదించింది. ఆదివాసీలను ఇబ్బంది పెట్టకుండా, అటవీ నియమాలను ఉల్లంఘించకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి కొండా సురేఖ సూచించారు. అటవీ రక్షణ, ఆదివాసీ హక్కులకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.  

స్టాండింగ్ కమిటీ ఏర్పాటు.. 

వన్యప్రాణుల సంరక్షణ కోసం తీసుకుంటున్న నిర్ణయాలను మరింత మెరుగుపర్చుకోవడానికి స్టాండింగ్ కమిటీని ఏర్పటు చేయనున్నారు. కమిటీ ఆదేశాల ప్రకారం వన్యప్రాణుల సంరక్షణకు రాష్ర్ట ప్రభుత్వానికి సలహాలు ఇవ్వొచ్చు. అభయారణ్యాలు, జాతీయ ఉద్యానవనాలు వంటి రక్షిత ప్రాంతాల సృష్టి, నిర్వహణకు సిఫార్సు చేయాలి. అడవులు, వన్యప్రాణులను ప్రభావితం చేసే అభివృద్ధి కార్యకలాపాలను అంచనా వేసి సలహా ఇవ్వాలి.

మానవ- జంతు సంఘర్షణను తగ్గించడానికి చర్యలను ప్రతిపాదించాలి. రాష్ర్ట ప్రభుత్వం సూచించిన ఏవైనా ఇతర సమస్యలను పరిష్కరించాలి. నిర్ణయాలు తీసుకోవడానికి ఏదైనా సమావేశంలో 50 శాతం సభ్యుల కోరం తప్పని సరి. నిర్దేశిత రిజర్ల వెలుపల పులులు, చిరుతపులి కార్యకలాపాలను నిశితంగా పరిశీలించడానికి అటవీ శాఖ ప్రధాన కార్యాలయంలో (అరణ్య భవన్) ఒక ప్రత్యేక టైగర్ సెల్ ఏర్పాటు చేయనున్నారు.

ఈ యూనిట్ కామారెడ్డి, నిర్మల్, జగిత్యాల, ఏటూరునాగారం, కిన్నెరసాని వంటి ప్రాంతాలలో పెద్ద పులుల కదలికలను ట్రాక్ చేయడానికి ఉపయోగపడనుంది. టోల్ గేట్ స్థానాలు, రుసుము నిర్మాణాలు, రోడ్డు ప్రమాదాల కారణంగా వన్యప్రాణుల మరణాల సంఖ్య, వృక్షజాలం, జంతుజాలంపై శబ్దం, దుమ్ము, వాయు కాలుష్యం  ప్రభావాలను అంచనా వేయనున్నారు. 

ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, కోరం కనకయ్య, మురళీ నాయక్, రామ్ దాస్ నాయక్, వెడ్మా బొజ్జూ, అటవీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అహ్మద్ నదీమ్, పీసీసీఎఫ్(హె ఓ ఎఫ్ ఎఫ్) డాక్టర్ సువర్ణ, అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు.

తెలంగాణ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ బోర్డు ఆమోదించిన అంశాలు.. 

వన్యప్రాణుల ప్రాంతాల్లో ప్రతిపాదిత ఆరు రహదారి ప్రాజెక్టులలో, ఒకటి మాత్రమే జాతీయ వన్యప్రాణుల బోర్డు  సిఫార్సు చేసి ఆమోదించింది. మిగిలిన ఐదు అటవీ నిబంధనలను ఉల్లంఘించనున్న నేపథ్యంలో, అనధికారిక గిరిజన స్థావరాలను అనుసంధానించడానికి ఉద్దేశించిన కారణంగా తిరస్కరించారు.

చట్టబద్ధంగా అనుమతించబడిన రైట్ ఆఫ్ వే  కిందకు వచ్చే ఐదు ప్రాజెక్టులను రాష్ర్ట ప్రభుత్వం ఆమోదించింది. అటవీ ప్రాంతా ల గుండా వెళుతున్న మిగిలిన మూడు ప్రాజెక్టులను 2025 జూన్ 26న నిర్వహించిన సమావేశంలో ఆమోదించింది.

ములుగు జిల్లాలో 11 కేవీ విద్యుత్ లైన్, అప్రోచ్ రోడ్డును నిర్మించాలనే ప్రతిపాదనను  తిరస్కరించింది, దీని ద్వారా పర్యావరణ సమస్యలు తలెత్తనున్నాయని బోర్డు స్పష్టం చేసింది.