07-10-2025 12:00:00 AM
కలెక్టర్ హనుమంతరావు
యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 6 (విజయక్రాంతి): జడ్పీటీసీ, ఎంపీటీసీ,స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కై ఏర్పాటు చేసిన శిక్షణ తరగతులకు హాజరు కాని వారిపై క్రమ శిక్షణ చర్యలు తప్పవని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత రావు హెచ్చరించారు. సోమవారం తుర్కపల్లి మండలం స్థానిక సంస్థల ఎన్నికల్లో పాల్గొనే ప్రిసైడింగ్ , అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ ఒక్కరికి కూడా మినహాయింపు ఇవ్వబడదన్నారు.
ప్రతి ఒక్కరు తప్పని సరిగా విధులకు హాజరు కావాల్సిందే అన్నారు.ప్రతి ఒక్కరు శిక్షణ కార్యక్రమములో పాల్గొనాలని, ఈరోజు శిక్షణ కార్యక్ర మం నకు హాజరు కానీ వారిపై చర్యలు తప్పవని అన్నారు. ఈ ఎలక్షన్స్ లో నిర్వహణ లో ఎలాంటి తప్పులు చేయకుండా నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించాలి అన్నారు. ఏమి అయినా సందేహాలుంటే వెంటనే నివృత్తి చేసుకోవాలన్నారు. సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండి మెరుగైన వైద్యం అందించాలి
యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 6 (విజయక్రాంతి): వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండాలని, ఆస్పత్రికి వచ్చే పేషెంట్లకు మెరుగైన వైద్యం అందించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. సోమవారం రాజాపేట మండలం చల్లూరు గ్రామంలో పల్లె దవాఖాన ని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్. అటెండెన్స్ రిజిస్టర్ ను పరిశీలించి, సిబ్బంది అందరూ విధులకు హాజరయ్యారని అడిగి తెలుసుకున్నారు..
పల్లె దవాఖాన కి వైద్యం కోసం వచ్చిన వృద్ధులతో కలెక్టర్ మాట్లాడుతూ ఏ వైద్యం కోసం ఆసుపత్రి కి వచ్చారని, మందులు ఇస్తున్నారా , దవాఖాన లో మీరు వచ్చినప్పుడు సిబ్బంది అందరు ఉన్నారా, వెంటనే చికిత్స అందించారా అని అడిగి తెలుసుకున్నారు. పరిసరాలలు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. పల్లె దవాఖాన చుట్టూ పిచ్చి మొక్కలు బాగా పెరిగి ఉండటంతో వెంటనే చెట్లను తొలగించి శుభ్రంగా చేయాలని పంచాయతీ కార్యదర్శి ని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.