calender_icon.png 7 October, 2025 | 11:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్నికల వేళ బీఆర్‌ఎస్‌కు బిగ్‌షాక్..

07-10-2025 12:00:00 AM

ఎమ్మెల్యే మదన్‌మోహన్  ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు

కామారెడ్డి, అక్టోబర్ 6, (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం రామారెడ్డి మండల బీఆర్‌ఎస్ మండల ఉపాధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, PACS సొసైటీ డైరెక్టర్ రాజేందర్, గిద్ద గ్రామానికి చెందిన మాజీ వార్డ్ మెంబర్స్ నర్సవ్వ, రాజవ్వ, రమేష్ రెడ్డి, సీనియర్ నాయకులు లింబ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి తో పాటు 30 మంది నాయకులు బీఆర్‌ఎస్ పార్టీని వీడి, సోమవారం ఎమ్మెల్యే మదన్ మోహన్  ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా  నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్యే మదన్ మోహన్  నాయకత్వంలో రామారెడ్డి మండలంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చూసి ఆకర్షితులమయ్యాం. ప్రజల కోసం నిజమైన సేవ చేయడానికి కాంగ్రెస్ పార్టీలో చేరాం అని తెలిపారు. ఈ కార్యక్రమం లో మండల అధ్యక్షులు ప్రవీణ్ గౌడ్, రామారెడ్డి మాజీ సర్పంచ్ రంగు రవీందర్, AMC డైరెక్టర్ రవుఫ్, మండల ఉపాధ్యక్షులు, మండల కాంగ్రెస్ పార్టీ సెక్రటరీ, మండల BC సెల్ అధ్యక్షులు, సీనియర్ నాయకులు అరవింద్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.