18-11-2025 01:04:16 AM
హైదరాబాద్, నవంబర్ 17 (విజయక్రాంతి) : సౌదీ బస్సు ప్రమాదంపై యాక్షన్ ప్లాన్ రెడీ చేయాలని న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ శశాంక్ గో యెల్ అధికారులను ఆదేశించారు. సౌదీ అరేబియాలో భారతీయ ప్రయాణికులు మ క్కా నుంచి మదీనాకు ప్రయాణిస్తున్న సమయంలో ఘోర బస్సు ప్రమాదం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వ సూచనల మేరకు ఘటనకు సంబంధించి న్యూ ఢిల్లీలోని ఆయన సోమవారం అత్యవసర సమీక్షా సమవేశాన్ని నిర్వహించారు. తక్షణమే సరైన యాక్షన్ ప్లాన్ ఏర్పాటు చేయా లని సీనియర్ అధికారులను ఆదేశించారు.
బాధితులు, గాయపడిన వారి గురించి కచ్చితమైన వివరాలను సేకరించాలని సూచిం చారు. దీని కోసం భారత విదేశాంగ మంత్రి త్వ శాఖ, రియాద్‌లోని భారత రాయబార కార్యాలయం, సౌదీ అధికారులతో నిరంతర సంప్రదింపులు కొనసాగించాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగు ణంగా హైదరాబాద్ సీనియర్ అధికారులతో, ఎన్‌ఆర్‌ఐ సంక్షేమాన్ని నిర్వహించే వారితో సమన్వయం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రమాదంలో తెలంగాణకు చెందిన వారు ఎంత మంది ఉన్నారో నిర్ధారించాలని స్పష్టం చేశారు.
ఆల స్యం జరగకుండా అన్ని సహాయక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వేగంగా సమాచారాన్ని తెలుసుకోవడానికి, సంప్రదింపులు జరిపేందుకు వీలుగా తెలంగాణ భవన్ నుంచి ఒక అధికారిని ప్రత్యేకంగా విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యాలయంలోనే అందుబాటులో ఉండాలని ఆదేశిం చారు.
ప్రమాదానికి సంబంధించిన వివరాలు తెలుసుకోవడానికి, సమన్వయం చేయడానికి 24 గంటలూ అందుబాటులో ఆ అధికారి ఉండాలన్నారు. ప్రమాదానికి సంబంధించిన సమాచారం కోసం తెలంగాణ భవన్ అధికారులు నిత్యం అందు బాటులో ఉంటారని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో సెక్రటరీ కో ఆర్డినేటర్ డా. గౌరవ్ ఉప్పల్, ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.