calender_icon.png 18 November, 2025 | 5:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సిర్పూర్@7 డిగ్రీలు

18-11-2025 01:03:29 AM

-ఆసిఫాబాద్ జిల్లాలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు

-వణుకుతున్న గిరిజనులు

కుమ్రంభీం ఆసిఫాబాద్, నవంబర్ 17 (విజయక్రాంతి): కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతు న్నారు. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా నమోదైన ఉష్ణోగ్రతలలో అత్యల్పంగా ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ యు మండలంలో 7 డిగ్రీలు నమోదైంది. ఉష్ణోగ్రతలు పడిపోతూ ఉండటంతో ఏజెన్సీ ప్రాంతంలో చలి తీవ్రత పెరిగి, గిరిజనులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం 8 గంటల వరకు ఈదురుగాలులు వీస్తుండటంతో పాటు సాయంత్రం ఐదు గంటల నుంచే చలి ప్రతాపాన్ని చూపుతుంది. చలి తీవ్రత నుంచి రక్షించుకునేందుకు ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.