calender_icon.png 27 September, 2025 | 8:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పత్తి చేనును ధ్వంసం చేసిన ఫారెస్ట్ అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలి

27-09-2025 07:15:29 PM

ఆళ్ళపల్లి,(విజయక్రాంతి): మండల పరిధిలోని రాయపాడు గ్రామానికి చెందిన ఊ కే. నాగేశ్వరావు అనే రైతు పత్తి చేను రాత్రికి రాత్రే ఆటవిశాఖ అధికారులు ధ్వంసం చేయడం అమానుషమైన చర్య అని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రేసు ఎల్లయ్య అన్నారు. శనివారం వ్యవసాయ కార్మిక సంఘం(బీకేఎంయు) నాయకులు ఊకె నాగేశ్వరరావుకు చెందిన ధ్వంసం అయిన పత్తి చేనును పరిశీలించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అసలే అధిక వర్షపాతంతో రైతులు పంట నష్టపోయి అనేక ఇబ్బందులు పడుతుంటే మరోపక్క ఆటవిశాఖ అధికారులు చేతికొచ్చిన పంటను నేలమట్టం చేయడం సరైంది కాదన్నారు. లక్షలకు లక్షలు అప్పులు తెచ్చుకొని సాగు చేసుకుంటున్న పంటలను ఇలా ధ్వంసం చేయడం ఏంటి అని ప్రశ్నించారు. నష్టపోయిన రైతుకి రెండు లక్షల రూపాయల నష్టపరిహారం అందించాలని అలాగే పోడు పట్టా కలిగి ఉన్న పంట నష్టం చేసిన ఆటవిశాఖ అధికారులపై కఠినంగా చర్యలు తీసుకోవాలన్నారు.