calender_icon.png 27 September, 2025 | 9:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజా ప్రభుత్వంలో గ్రామాల అభివృద్ధి

27-09-2025 07:58:54 PM

తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్..

నియోజకవర్గంలో 18 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు

తుంగతుర్తి (విజయక్రాంతి): పేదల ఆత్మగౌరవంతో బతకాలనే ఆలోచనతో ప్రజా ప్రభుత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్లకు శ్రీకారం చుట్టినట్టు తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్ తెలిపారు. మండల పరిధిలోని సంగెం గ్రామంలో రూ.20 లక్షల ఎంజిఎన్ఆర్ఇజిఎస్ నిధులతో నూతనంగా నిర్మించనున్న గ్రామపంచాయతీ భవనానికి ముగ్గు పోసి శంకుస్థాపన చేశారు. అనంతరం గ్రామంలో మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ముగ్గు పోసి లబ్ధిదారులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ గ్రామ నాయకులు ఎమ్మెల్యేకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ మేరకు ఎమ్మెల్యే మాట్లాడుతూ... మండలంలోని ప్రతి గ్రామానికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు. పేద ప్రజల చిరకాల కోరిక ప్రతి దళిత, గిరిజన, బడుగు బలహీన, మైనారిటీల ఆత్మగౌరవం ఇందిరమ్మ ఇళ్లు అని అభివర్ణించారు.

పేదవాళ్లు గ్రామాల్లో ఆత్మగౌరవంతో బతకాలి, పది మందిలో తలెత్తుకొని నిలబడలంటే ప్రతి పేదవానికి ఇల్లు ఉండాలని ఆలోచించి నాటి కాంగ్రెస్ ప్రభుత్వం లక్షలాది ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రంలో ప్రజా పాలన వచ్చిన తర్వాత తెలంగాణ ఆడబిడ్డల ఆశీర్వాదంతో ఇందిరమ్మ ఇళ్లు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి డ్రైవర్ని ప్రారంభించినట్లు తెలిపారు. ఇల్లాలి ముఖంలో సంతోషం ఉంటే ఆ ఇల్లు బాగున్నట్లేనని, ఇంటి పెత్తనం తమ చేతిలో ఉంటే దానిని చక్కబెట్టే బాధ్యత ఆడబిడ్డ తీసుకుంటుందని అన్నారు అనంతరం అన్నారం గ్రామంలో నిర్మాణంలో ఉన్న మిట్ట గడుపుల నవ్య ఇంటిని పరిశీలించారు..ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చిన ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్ల లోనే నేటికీ పేదవారు ఉంటున్నారని ఆయన అన్నారు.

నాడు రెండేళ్ల పిల్లవాడు ఇప్పుడు పాతికేళ్లవాడు అయ్యాడని, ఆయనకు పెళ్లి అయ్యే పరిస్థితి వచ్చిందని వారికి సొంత ఇల్లు, వారు ఆత్మగౌరవంతో బతకాలనే ఇందిరమ్మ ఇళ్లు  మంజూరు చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా డిసిసిబి డైరెక్టర్ గుడిపాటి సైదులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న, పంచాయతీరాజ్ డిఈ లింగ నాయక్, ఏఈ మహేష్, హౌసింగ్ ఏఈ పూజ శ్రీ, గ్రామ కార్యదర్శి శేఖర్,కాంగ్రెస్ పార్టీ తుంగతుర్తి మండల ఉపాధ్యక్షుడు మారగాని వెంకటయ్య, గ్రామ శాఖ అధ్యక్షుడు ఏషమల్ల వెంకన్న, జిల్లా నాయకులు తిరుమల ప్రగడ కిషన్ రావు, సుంకరి జనార్ధన్,జిల్లా మహిళా కమిటీ జనరల్ సెక్రటరీ బండారు సావిత్రమ్మ, సంవిధాన్ మండల అధ్యక్షుడు మాచర్ల అనిల్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షురాలు పచ్చిపాల సుమతి వెంకన్న,సీనియర్ నాయకులు కలకోట్ల మల్లేష్, దాసరి శ్రీను, సంకినేని రమేష్,కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.