27-09-2025 07:52:57 PM
ఘట్ కేసర్ (విజయక్రాంతి): పోచారం మున్సిపల్ అన్నోజిగూడ గాయత్రీదేవి ఆలయంలో 6వ రోజు శనివారం శ్రీ మహాలక్ష్మీ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ప్రతిరోజు నిర్వహించే నవచండీ యాగం నిర్వహించారు. అనంతరం ఘట్ కేసర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివిన పూర్వ విద్యార్థులు (10వ తరగతి బ్యాచ్ 1993-94) అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ననావత్ జితేందర్ నాయక్, బోయిని జంగయ్య యాదవ్, వెంకటేష్ గౌడ్, బోయపల్లి కొండల్ రెడ్డి, రంజిత్ నాయక్, బాలగోని శ్రీనివాస్ గౌడ్, నల్లవెల్లి శివాజీ ముదిరాజ్, మొగుళ్ళ కృష్ణ గౌడ్, రాధారం బాలరాజ్, సాగర్ సంజిత్ యాదవ్, విస్లావత్ రవినాయక్, కాసుల శంకర్ గౌడ్ ఆలయ ట్రస్ట్ సభ్యులు మాజీ మున్సిపల్ చైర్మన్ బోయపల్లి కొండల్ రెడ్డి, నాబోతు సిద్ది రాములు గుప్తా, చెన్నమనేని వెంకటరావు, మోహన్ రావు, పానుగంటి నర్సింహారావు, గాలి బిక్షపతి, వేణుగోపాల్ శర్మ, రాంమూర్తి, కార్తీక్ పంతులు కౌశిక్ పంతులు, వినీల్ శర్మ తదితరులు పాల్గొన్నారు.