27-09-2025 08:02:39 PM
తెలంగాణ కోసం తన నివాసాన్నే త్యాగం చేసిన నాయకుడు..
కొండా లక్ష్మణ్ బాపూజీకి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఘన నివాళి..
కరీంనగర్ (విజయక్రాంతి): పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉపసభాపతిగా, మంత్రిగా, శాసనసభ్యునిగా అనేక పదవులు చేపట్టినా మచ్చలేని నాయకుడిగా సేవలందించిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఈ తరం నాయకులకు స్పూర్తిదాయకమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కొనియాడారు. కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని పురస్కరించుకుని కరీంనగర్ లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించిన బండి సంజయ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ పతాక కొండా లక్ష్మణ్ బాపూజీ. చేనేత సహకారోద్యమానికి నాయకత్వం వహించిన నాయకుడు అన్నారు.
నిజాం నిరంకుశ పాలనపై తిరుగుబావుటా ఎగరేసి తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీకను చాటిన మహానేత అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తన ఇంటినే త్యాగం చేసిన జల ద్రుశ్య ప్రదాత కొండా లక్ష్మణ్ బాపూజీ అని కొనియాదారు. తన జీవితమంతా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, బలహీనవర్గాలకు రాజ్యాధికారం అనే లక్ష్యాల కోసం అలుపెరగని పోరాటం చేసిన యోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అన్నారు. తెలుగు నేలపై సైకిల్ యాత్ర, పాదయాత్రలకు శ్రీకారం చుట్టిన మొట్ట మొదటి వ్యక్తి. ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదిన నాయకుడని ‘తెలంగాణ పీపుల్స్ పార్టీ’ స్థాపించి ప్రత్యేక రాష్ట్ర కాంక్షను చాటిన నేత బాపూజీ అన్నారు.