calender_icon.png 27 September, 2025 | 9:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కుల గణన ఆధారంగా రిజర్వేషన్లు కల్పించాలి

27-09-2025 07:43:13 PM

చొప్పదండి (విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికలలో దళితులు, గిరిజన వర్గాలకు రిజర్వేషన్లు కేటాయించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. 2024 కుల గణన నివేదిక అందుబాటులో ఉండగా ఎస్సీ, ఎస్టీ వర్గాలకు మాత్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 2011 నాటి పాత గణాంకాల ఆధారంగా రిజర్వేషన్లు కేటాయించడం దారుణమని ఆయన పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధపడటం శుభపరిణామమని అభినందిస్తూనే, వెనకబడిన తరగతులకు(బీసీ) 2024 కులగణన ఆధారంగా 42% రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో నం. 9 జారీ చేయడం హర్షణీయమని తెలిపారు. అయితే, ఇదే న్యాయం ఎస్సీ, ఎస్టీ వర్గాలకు వర్తించకపోవడం అన్యాయమన్నారు. 

"ఒక వైపు బీసీ వర్గాలకు తాజా గణాంకాలను పరిగణనలోకి తీసుకొని రిజర్వేషన్లు పెంచడం సరైన నిర్ణయమే. కానీ, దళితులు, గిరిజన వర్గాలకు మాత్రం అప్పటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందునాటి, దాదాపు 14  ఏళ్ల కిందటి 2011 సర్వే ప్రకారం రిజర్వేషన్లు కేటాయించడం ఘోరమైన అన్యాయం. కళ్ళెదుటే 2024 కుల గణన సర్వే రిపోర్ట్ అందుబాటులో ఉంది. దానిని పక్కన పెట్టి పాత లెక్కలను అనుసరించడం శోచనీయం" అని విమర్శించారు. రిజర్వేషన్ల కేటాయింపులో ద్వంద్వ ప్రమాణాలు అనుసరించడం వల్ల ఎస్సీ, ఎస్టీ వర్గాలకు స్థానిక సంస్థల్లో రావాల్సిన సమాన ప్రాతినిధ్యం దక్కకుండా పోతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అందువల్ల, ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని, బీసీ వర్గాలకు కల్పించిన విధంగానే, దళితులు మరియు గిరిజన వర్గాలకు కూడా తాజా 2024 కుల గణన సర్వే నివేదిక ఆధారంగానే రిజర్వేషన్లు కల్పించాలని కోరారు.