27-09-2025 07:46:04 PM
రాజన్న సిరిసిల్ల (విజయక్రాంతి): రవీంద్రభారతిలో జరిగిన తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి, టూరిజం, సాంస్కృతిక శాఖ మాత్యులు జూపల్లి కృష్ణారావు, సాంస్కృతిక సారధి చైర్ పర్సన్ డాక్టర్ గద్దర్ వెన్నెలక్కని తెలంగాణ సాంస్కృతిక సారధి రాజన్న సిరిసిల్ల జిల్లా కళాకారులు ఘనంగా సన్మానం చేయడం జరిగింది. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ప్రసాదం అందించడం జరిగింది. ఈ సన్మాన కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కళాకారులు ఎడమల శ్రీధర్ రెడ్డి, గుగ్గిళ్ళ పరుశరాములు, సాంస్కృతిక సారధి రాజన్న సిరిసిల్ల జిల్లా ఉద్యోగుల సంఘం ముఖ్య సలహాదారు శ్రీరాముల రామచంద్రం మహబూబాబాద్ సాంస్కృతిక సారధి కళాకారుల ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు కంబాలపల్లి సత్యనారాయణ సిద్దిపేట జిల్లా సాంస్కృతిక సారధి నాయకులు పుల్లూరు యాదగిరి తదితరులు పాల్గొన్నారు.