calender_icon.png 27 September, 2025 | 8:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయం హర్షణీయం

27-09-2025 07:26:36 PM

బీసీలకు 42% రిజర్వేషన్లు హర్షణీయం

జిల్లా కాంగ్రెస్ నాయకులు నాగరాజ్ గౌడ్

కామారెడ్డి,(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించి జీవో జారీ చేయడం పట్ల జిల్లా కాంగ్రెస్ నాయకులు అంకన్నగారి నాగరాజ్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. శనివారం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...  తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో42%రిజర్వేషన్లు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం ప్రజా పాలనకు నిదర్శనమన్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం బిసిల పట్ల వారిని రాజకీయ, విద్య, ఉద్యోగ రంగాలలో అభివృద్ధి చేయాలన్న సంకల్పం రిజర్వేషన్లతో నెరవేరనుందన్నారు.

అగ్రవర్ణమైన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి వర్గం బిసి రిజర్వేషన్లు అమలు కోసం అహర్నిశలు కృషి చేసారన్నారు . లోకసభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇచ్చిన మాట తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీఎం రేవంత్ రెడ్డి సారధ్యంలో అమలు చేసేందుకు కృషి చేసిందన్నారు. రాజకీయ, సాంకేతిక, న్యాయ పరమైన, రాజ్యాంగ పరమైన అన్ని రకాల చర్యలు తీసుకొని ఇప్పుడు జీవో ఇచ్చిందన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో పకడ్బందీగా కులగణన చేపట్టి బీసీ కమిషన్ వేసి అన్ని రకాలుగా సాంకేతికంగా సమాచారాన్ని సేకరించి రిజర్వేషన్లు అమలు చేసేందుకు జీవో ఇచ్చి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకుందన్నారు.