27-09-2025 07:10:52 PM
సాహసోపేతమైన నిర్ణయం
రిజర్వేషన్లను అడ్డుకుంటే బీజేపీ, బీఆర్ఎస్ కు గుణపాఠం తప్పదు
విలేకరుల సమావేశంలో వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి
వనపర్తి,(విజయక్రాంతి): దేశ చరిత్రలోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 9 విడుదల చేయడం అభినందనీయమని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి అన్నారు. శనివారం వనపర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... భారతదేశంలోనే కాక తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక జనాభా కలిగిన బీసీలకు స్థానిక ఎన్నికలలో రిజర్వేషన్ కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందని అన్నారు.
గత అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు పేద ప్రజల ఆశాజ్యోతి రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జో డో యాత్ర సందర్భంగా కాశీ నుంచి కన్యాకుమారి వరకు చేపట్టిన పాదయాత్ర ద్వారా దేశంలో తెలంగాణ రాష్ట్రంలో బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి అడుగు అడుగున ప్రజలతో మాట్లాడుతూ ఈ రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో బీసీలకు రిజర్వేషన్ల అంశంపై కుశలంగా నిశితంగా పరిశీలించిన రాహుల్ గాంధీ తోపాటు సోనియాగాంధీ కామారెడ్డి ఎన్నికల బహిరంగ సభలో బీసీ డిక్లరేషన్ లో భాగంగా చేస్తున్న ఇచ్చిన హామీ మేరకు మాటకు కట్టుబడి 42% రిజర్వేషన్ అమలు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి గవర్నర్ కు పంపించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
కొంతమంది టిఆర్ఎస్ బిజెపి పార్టీలకు చెందిన బిసి వ్యతిరేకవాదులు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో చేసిన తీర్మానానికి సహకరించకుండా బీసీ బిల్లు ప్రవేశపెట్టకుండా అడ్డుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ పార్లమెంటులో బీసీ బిల్లుకు ఆమోదం తెలపకుండా బిజెపి పార్టీ నాయకులు తెలంగాణ నుంచి గెలుపొందిన 8 మంది ఎంపీలు బీసీల పట్ల చిత్తశుద్ధి చూపకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని వెంటనే బీసీలకు సమాధానం చెప్పాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు.బి ఆర్ ఎస్ పార్టీ బిజెపి పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించాలని ఆయన డిమాండ్ చేశారు.
తెలంగాణ రాష్ట్రం నుంచి ఎనిమిది మంది ఎంపీలను ఈ రాష్ట్ర ప్రజలు పార్లమెంటుకు పంపిస్తే బిజెపి ఎంపీలు ఢిల్లీలో ఐ డ్రామా చేస్తున్నారని ఆయన ఆరోపించారు. బీసీల రిజర్వేషన్ బిల్లును ఆమోదం తెలపాలని కోరుతూ తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసినా కూడా టిఆర్ఎస్ పార్టీ బిజెపి పార్టీల నాయకులు మద్దతు తెలుపకుండా కుటీలకు కుతంత్రాలకు పాల్పడ్డారని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలో చేపట్టిన కాంగ్రెస్ పార్టీ ధర్నాకు ఎందుకు బిజెపి పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఆఫ్ నాయకులు మద్దతు ప్రకటించలేదని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిన మాట ప్రకారం ఎంతో నిశితంగా ఎక్కడ పొరపాటు లేకుండా కులగణ సర్వేను చేపట్టి బీసీల రిజర్వేషన్ ప్రవేశపెట్టడం జరిగిందని అన్నారు.
2011 జనాభా లెక్కల ప్రకారం జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ బీసీలకు 42 శాతం కేటాయించడం జరిగిందని అన్నారు. దేశంలో ఒక తమిళనాడు రాష్ట్రం తప్ప మిగతా రాష్ట్రాలలో ఎక్కడ కూడా ఇలాంటి గొప్ప నిర్ణయం ఏ రాష్ట్రం కూడా చేపట్టలేదని తెలంగాణ రాష్ట్రం లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సామాజిక వర్గానికి చెందినప్పటికీ ఎన్నికల ముందు బీసీలకు ఇచ్చిన మాట ప్రకారం 42% రిజర్వేషన్కు కట్టుబడి పని చేస్తున్నాడని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ సోనియాగాంధీ తదితర పెద్దలకు తెలంగాణ ప్రజలు రుణపడి ఉన్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం తీసుకున్న ఈ నిర్ణయం చూసి బిజెపి పాలిత రాష్ట్రాలు బుద్ధి నేర్చుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.
తప్పుడు కేసులు పెట్టి బీసీల రిజర్వేషన్ బిల్లును కోర్టు కేసులు వేసి అడ్డుకుంటే టిఆర్ఎస్ పార్టీ బిజెపి పార్టీ నాయకులకు తగిన గుణపాఠం చెప్పడానికి బీసీ ప్రజలు చైతన్యం కావాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని మరొకసారి నిరూపించడం జరిగిందని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఆశీర్వదించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో వనపర్తి జిల్లాల్లో వివిధ బిసి కుల సంఘాల నాయకులు ఐక్యమత్యంతో ఉండాలని కొంతమంది దుర్మార్గులు చేస్తున్న కుట్రలు కుతంత్రాలను తరిమికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు.