25-10-2025 07:34:52 PM
నగరపాలక సంస్థ కమిషనర్ ప్రపుల్ దేశాయ్..
కరీంనగర్ (విజయక్రాంతి): అక్రమ నల్లా కనెక్షన్లపై ప్రత్యేక దృష్టి సారించి... వాటిని అరికట్టేందుకు చర్యలు తీస్కోవాలని కమిషనర్ ప్రపుల్ దేశాయ్ ఇంజనీరింగ్ అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. కరీంనగర్ నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో శనివారం ఇంజనీరింగ్ విభాగం అధికారులు, సిబ్బందితో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ ప్రఫూల్ దేశాయ్ మాట్లాడుతూ... నగరపాలక సంస్థ పరిధిలో మంచినీటి నల్లా కనెక్షన్ల వివరాల సేకరణపై ప్రత్యేక సర్వే చేపట్టాలని ఆదేశించారు. రిజర్వాయర్ల పరిదిలోని సప్లైల వారిగా కమర్షియల్, రెసిడెన్షియల్, డబుల్ నల్లా కనెక్షన్లను ట్యాన్ నెంబర్ల ప్రకారం వివరాలను సేకరించాలన్నారు.
నల్లా కనెక్షన్ పొందిన ప్రకారం ఇంచుల వారిగా వివరాలను సేకరించి పూర్తి వివరాలను ఫార్మాట్ ప్రకారం వారం రోజుల్లో అందించాలని ఆదేశించారు. నగర ప్రజలకు సప్లై సమయం ప్రకారం తాగు నీటిని సరఫరా చేయడంతో పాటు నగర వ్యాప్తంగా ఎక్కడ లీకేజీలు ఉన్న వెంట వెంటనే అరికట్టి నీరు వృధా కాకుండా అధికారులు సిబ్బంది చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో ఎస్ఈ రాజ్ కుమార్, ఈఈ యాదగిరి, సంజీవ్ కుమార్, డీఈలు ఓం ప్రకాష్, లచ్చిరెడ్డి, దేవేందర్, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, అయూబ్ ఖాన్ ఏఈలు, లైన్ మెన్లు, పిట్టర్లు, ఎలక్ట్రికల్ సిబ్బంది పాల్గొన్నారు.