calender_icon.png 26 October, 2025 | 5:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భక్తిశ్రద్ధలతో నాగుల చవితి వేడుకలు

25-10-2025 07:31:36 PM

వెంకటాపురం(నూగూరు),(విజయక్రాంతి): నాగుల చవితి వేడుకలను శనివారం మండలంలోని భక్తులు అత్యంత భక్తిశ్రద్ధల నడుమ  ఘనంగా జరుపుకున్నారు. ఉదయం నుండి మండల కేంద్రంలోని శివాలయం, పాత సినిమా హాల్ సెంటర్ ప్రాంతంలోని పుట్టల వద్ద భక్తులు పుట్టల్లో పాలు పోయడానికి బారులు తీరారు. ముఖ్యంగా మహిళలు పుట్టల వద్ద ప్రత్యేక పూజలు చేస్తూ పుట్టలో పాలు పోసి భక్తిని చాటుకున్నారు. ఉదయం నుంచి పాము పుట్టల వద్ద సందడి నెలకొన్నది. వందలాది మంది భక్తులు ఆవుపాలతో పుట్టలో పాలు పోసి నాగదేవతల ఆశీర్వాదం కావాలంటూ వేడుకున్నారు. అత్యంత భక్తి శ్రద్దల నడుమ వైభవంగా నాగుల చవితి వేడుకలు మండలంలో జరిగాయి.