05-08-2025 01:09:39 AM
కలెక్టర్ బి.యం సంతోష్
గద్వాల, ఆగస్టు 4: విద్యార్థులు ప్రతిభ పోటీలలో పాల్గొనడం ద్వారా విద్యార్థుల్లో చైతన్యం కలుగుతుందని జిల్లా కలెక్టర్ బి. యం సంతోష్ తెలిపారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రజానాట్యమండలి జి ల్లా కమిటీ ఆధ్వర్యంలో దేశభక్తిని చాటుదాం అనే కార్యక్రమం ద్వారా జిల్లాలోని విద్యార్థిని విద్యార్థులకు ప్రతిభా పోటీలు నిర్వహిస్తున్నారు.
ప్రతిభ పోటీల కార్యక్రమానికి సం బంధించిన కరపత్రాన్ని జిల్లా కలెక్టర్ సోమవారం తమ ఛాంబర్ లో ఆవిష్కరించి మా ట్లాడారు.ఈ కార్యక్రమంలో ప్రజానాట్య మండలి జి ల్లా అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ రెడ్డి,జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ ఆశన్న, జి ల్లా నాయకులు తిమ్మప్ప, నరసింహ, అభిరామ్, ప్రవీణ్, ఎలీషా, రాజేష్ పాల్గొన్నారు.