20-08-2025 11:25:30 PM
విద్యుత్ శాఖ డీఈ జీవన్ కుమార్
బూర్గంపాడు,(విజయక్రాంతి): బూర్గంపాడు మండల వ్యాప్తంగా ఉన్న విద్యుత్ స్తంభాలకు స్థానిక కేబుల్ ఆపరేటర్లు సెటప్ బాక్స్ లు వైర్లు తక్షణమే తొలగించాలని విద్యుత్ శాఖ డిఈ జీవన్ కుమార్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. స్థానిక కేబుల్ ఆపరేటర్లు విద్యుత్ స్తంభాలకు విద్యుత్ వైర్లకు దగ్గరగా సెటప్ బాక్స్ లు వైర్లు తగిలించడం వలన ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున వాటిని మూడు రోజుల వ్యవధులలో తొలగించాలని లేనియెడల శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
రాబోయే వినాయక చవితి పండుగ సందర్భంగా వినాయక మండపాలు ఏర్పాటు చేసే కమిటీ సభ్యులు తప్పనిసరిగా విద్యుత్ శాఖ అనుమతి తీసుకొని విద్యుత్తును ఉపయోగించుకోవాలని సూచించారు. లేనియెడల ఆయా మండపాల కమిటీ సభ్యులకు బాధ్యులు అవుతారని తెలియజేశారు. వినాయక నిమజ్జనం ఏర్పాటు చేసే సమయంలో విద్యుత్ తీగల వలన ప్రమాదం ఉంటే తమ దృష్టికి తేవాలని పేర్కొన్నారు.