20-08-2025 11:31:24 PM
గంభీరావుపేట,(విజయక్రాంతి): జిల్లాలో రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన గంభీరావుపేట మండలం పెద్దమ్మ స్టేజ్ మూల మలుపు వద్ద బుధవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. పోలీసులు కథనం ప్రకారం... కామారెడ్డి జిల్లా పాల్వంచ మర్రి గ్రామానికి చెందిన కడమంచి వెంకటి (53) అనే వ్యక్తి యాక్టివా స్కూటీ పై సముద్రలింగాపూర్ కు వెళ్ళి తిరిగి వస్తుండగా, పెద్ద స్టేజ్ మూల మలుపు వద్ద, ఎదురుగా అతి వేగంగా వస్తున్న కారు (టీఎస్ 23 జి 0580) స్కూటీ నీ డీ కొట్టింది. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు ధృవీకరించారు. మృతుడి భార్య కడమాంచి లీలా పోలీసులకు పిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రమాకాంత్ తెలిపారు.