calender_icon.png 21 August, 2025 | 2:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటిన ఎమ్మెల్యే కోరం

20-08-2025 11:18:39 PM

టేకులపల్లి,(విజయక్రాంతి): ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా టేకులపల్లి మండలం గోల్యతండా పంచాయితీ పశువుల సంత ఆవరణలో బుధవారం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపడుతోందని, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఒక మొక్క నాటాలని పిలుపునిచ్చారు. పర్యావరణాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత అని, ప్రతి పౌరుడు మొక్కల సంరక్షణలో భాగస్వామ్యం కావాలని కోరారు.