calender_icon.png 21 August, 2025 | 2:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాప్యం లేకుండా ఉద్యోగులకు సేవలు

20-08-2025 11:22:25 PM

ఇల్లెందు,(విజయక్రాంతి): సింగరేణి ఇల్లందు ఏరియాలోని జనరల్ మేనేజర్ కార్యాలయంలో  డి.జి.యం. (పర్సనల్) అజ్మీర తుకారాం  సింగరేణి ఉద్యోగులకు జాప్యం లేకుండా సేవలందించాలని అన్నారు. ఇల్లందు ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయంలో  కాన్ఫరెన్స్  హాల్ లో బుధవారం వివిధ గనులు, విభాగాల మినిస్ట్రియల్ స్టాఫ్ తో సమావేశం ఏర్పాటు చేసారు.

ఇందులో బాగంగా ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగుల టెర్మినల్ బెనిఫిట్స్, గృహ రుణాల రాయితీ, కారుణ్య నియామకాలు, మెడికల్ బోర్డు, కాంట్రాక్ట్ ఉద్యోగుల బ్యాంకు ఇన్సురెన్స్ వివరాలు  తదితర సంక్షేమ పథకాలు, ఉద్యోగుల గైర్హాజరు అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. గనులు, డిపార్టుమెంట్ల వారీగా పెండింగ్ దరఖాస్తుల వివరాలు తెలుసుకున్నారు. దరఖాస్తు దారులకు నిత్యం సమాచారం అందిస్తూ, వేగంగా పరిష్కరించాలని సిబ్బందికి సూచించారు. ఉద్యోగులు ఉత్సాహంగా పనిచేస్తూ పెండింగ్ దరఖాస్తులు లేని ఏరియాగా ఇల్లందుని నిలపాలని సూచించారు.