calender_icon.png 21 August, 2025 | 2:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు

20-08-2025 11:28:30 PM

వేములవాడ టౌన్,(విజయక్రాంతి): వేములవాడ మాజీ ప్రధాని భారతరత్న రాజీవ్ గాంధీ జయంతిని  పురస్కరించుకొని వేములవాడ మున్సిపల్ పరిధిలోని టిఎస్ ఆర్టీసీ బస్ స్టాండ్ తిప్పాపూర్ లో వేములవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొని రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

 ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ దేశ అభివృద్ధికి రాజీవ్ గాంధీ చేసిన కృషి, సమాచార విప్లవానికి బాటలు వేసిన దూరదృష్టి ఎప్పటికి స్మరణీయమని పేర్కొన్నారు. యువతకు ఆయన ఆలోచనలు ప్రేరణనిస్తాయని, ఆయన కలల భారతాన్ని సహకారం చేయడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు.