calender_icon.png 21 August, 2025 | 2:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తల్లిదండ్రుల కృషివల్లే ఈ స్థాయికి ఎదిగా

20-08-2025 11:36:26 PM

బిచ్కుంద,(విజయక్రాంతి): ఉస్మానియా యూనివర్సిటీలో ప్రతిష్టాత్మక చేపట్టినటువంటి 84వ స్నాతకొత్సవం లో ఇస్రో చైర్మన్ డాక్టర్. వి. నారాయణ చేత పీహెచ్డ్ డాక్టరేట్ పట్టా అందుకున్న కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని లాడేగాం గ్రామానికి చెందిన సుర్నార్ బాలాజీ పాటిల్ తండ్రి అంగత్ రావు  పాటిల్. "సమకాలిన ఉపన్యాసాలలో మానవీయ విలువలు" అనే అంశంపై ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ అప్సర్ ఉన్నిసా బేగం పర్యవేక్షణలో హిందీ విభాగంలో దాదాపు 5 సంవత్సరాలు పరిశోధనలు పూర్తి చేయడం జరిగింది.

ఈ సందర్భంగా డాక్టర్ బాలాజీ మాట్లాడుతూ. చదువుకోవాలని సంకల్పం ఉన్న ప్రతి విద్యార్థి కష్టాలను ఇష్టంగా మార్చుకొని ముందుకెళ్తాడని నేను చిన్నప్పటినుంచి ఎంతో కష్టపడి చదివి ఈ డాక్టరేట్ పట్టాను తీసుకోవడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ నా పీహెచ్డ్ పట్టాను నన్ను కష్టపడి స్థాయికి తీసుకొచ్చిన మా తల్లిదండ్రులకు అంకితం చేస్తున్నానని అన్నారు. స్థాయి వచ్చే వరకు నా వెన్నం నుండి నన్ను ప్రోత్సహించిన, తల్లి రుక్మిణి బాయ్, సోదరుడు మారుతి, నా జీవిత భాగస్వామి (యశోద), నా పిల్లలకు, నా చిన్ననాటి నుండి ఇప్పటి వరకు నా స్నేహితులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తెలిపారు.