calender_icon.png 15 September, 2025 | 2:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్రమంగా వ్యర్థాలను డంపుచేసే వారిపై చర్యలు తీసుకోవాలి

15-09-2025 12:05:10 AM

 టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జెలమోని రవీందర్ 

ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 14: స్వచ్చమైన నీటితో కళకళలాడుతున్న ఇబ్రహీంపట్నం పెద్ద చెరువు నీటిలో వ్యర్థాలను కలిపే కుట్ర చేస్తున్నారని, ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలనీ టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జెలమోని రవీందర్, రాష్ట్ర నాయకులు మెట్టు దామోదర్ రెడ్డి ఆదివారం ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

ఇబ్రహీంపట్నం పెద్ద చెరువులో శనివారం రాత్రి  జిహెచ్‌ఎంసి కి సంబందించిన వాహనాలలో చెత్తను తీసుకొచ్చి అక్రమంగా డంపు చేస్తుండడంతో సమాచారం అందుకున్న పోలీసులు ఐదుగురిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ తరలించారు. ఈ విషయంపై టిడిపి నాయకులు మాట్లాడుతూ..

పెద్ద చెరువులో హైదరాబాద్ జిహెచ్‌ఎంసి నుండి మెడికల్ రసాయనాలు, వ్యర్ధాలను టిప్పర్లలో తీసుకొచ్చి వేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. దీని వెనుక ఎంతటి వారున్నా ఉపేక్షించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు.