15-09-2025 12:03:58 AM
- రాష్ట్ర అధ్యక్షులు చంటి ముదిరాజ్
సిద్దిపేట, సెప్టెంబర్14 (విజయక్రాంతి): ప్రజలకు ఆర్టిఐపై సరైన అవగాహన లేదని, కమిటీ కార్యకర్తలు ఆర్టిఐ ప్రాధాన్యతను ప్రజలకు చేరవేయాలని ఆర్టీఐ సాధన కమిటీ రాష్ట్ర అధ్యక్షులు చంటి ముదిరాజ్ అన్నారు. సమాచార హక్కు చట్టం 2005 లో స్థాపించి 20 ఏళ్లు గడుస్తున్నప్పటికీ ప్రజలకు ఆర్టిఐ వినియోగం గురించి సరైన అవగాహన రాలేదన్నారు. సిద్దిపేటలోని ప్రెస్ క్లబ్ లో సమాచార హక్కు చట్టం సాధన కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు.
సభ్యులు సమిష్టిగా పని చేసి విద్య, వైద్య, ప్రభుత్వ కార్యాలయాల్లో ఆర్టిఐ ద్వారా సమాచారం సేకరించడం, గవర్నెన్స్ మెరుగుదలకు గుర్తింపు లభిస్తుందన్నారు. ఏదైనా ఆర్టిఐ సంబంధిత సాంకేతిక మద్దతు కోసం జాతీయ, రాష్ట్ర కమిటీలను సంప్రదించడానికి వెనుకాడాకండని, ఆర్టిఐ లగాన్ బ్రస్టాచర్ హట్టవ్ అనే నినాదంతో ముందుకెళ్లాలని సూచించారు. ఈ సమావేశంలో సిద్దిపేట జిల్లా వైస్ ప్రెసిడెంట్ మూల జితేందర్ రెడ్డి, జిల్లా సెక్రటరీ వేల్పుల మహేందర్, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల ఆర్.టి.ఐ. కమిటీ సభ్యులుజాతీయ ప్రధాన కార్యదర్శి మల్లం వెంకటేశం గౌడ్, రాష్ట్ర అధ్యక్షురాలు సూర స్రవంతి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దిలీప్ రావు, రాష్ట్ర సెక్రటరీ చింతల కృష్ణ, సిద్దిపేట జిల్లా కమిటీ సభ్యులు ఆంజనేయులు, సంజీవ్ కుమార్, పండరి, మహిళ కన్వినర్ వీరమల్ల రామశ్రీ, సౌజన్యలు పాల్గొన్నారు.