29-01-2026 12:00:00 AM
హైదరాబాద్ వేదికగా నిర్వహణ
74వ బిఎన్ మల్లిక్ మెమోరియల్ టోర్నీ
53 జట్లు, 2 వేల మంది ప్రతినిధులతో మార్చి 23 నుంచి ఏప్రిల్ 5వ తేదీ వరకు పోటీలు
వెల్లడించిన డీజీపీ శివధర్‌రెడ్డి
హైదరాబాద్ సిటీ బ్యూరో, జనవరి 28 (విజయక్రాంతి): భాగ్యనగరం మరో ప్రతిష్టాత్మక జాతీయ స్థాయి క్రీడా పోటీలకు ఆతిథ్య మివ్వడానికి సిద్ధమైంది. దేశవ్యాప్తంగా ఉన్న పోలీస్ విభాగాల్లోని అత్యుత్తమ ఫుట్‌బాల్ క్రీడాకారులు తలపడే 74వ బిఎన్ మల్లిక్ మెమోరియల్ ఆల్ ఇండియా పోలీస్ ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్‌ను ఈ ఏడాది మార్చి నెలలో హైదరాబాద్‌లో నిర్వహించనున్నట్లు డీజీపీ శివధర్‌రెడ్డి వెల్లడించారు. బుధవారం డీజీపీ కార్యాలయంలో జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఆయన ఈ టోర్నీ గురించి వివరించారు.
‘మార్చి 23 నుంచి ఏప్రిల్ 5వ తేదీ వరకు 12 రోజుల పాటు సాగే ఈ క్రీడా సమరంలో దేశవ్యాప్తంగా ఉన్న 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలతో పాటు 11 కేంద్ర సాయుధ పోలీస్ బలగాలు, 6 కేంద్ర పోలీస్ సంస్థలకు చెందిన మొత్తం 53 జట్లు పాల్గొంటున్నాయి. సుమారు 1,060 మంది పురుష క్రీడాకారులు, 350 మంది మహిళా క్రీడాకారులు, కోచ్‌లు, రిఫరీలు కలిపి మొత్తం 2వేల మందికి పైగా ప్రతినిధులు భాగస్వాములు కానున్నారు. మొత్తం 125 మ్యాచ్‌లను గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియం, అజీజ్ నగర్‌లోని హెచ్‌ఎఫ్‌సి గ్రౌండ్, మోయినాబాద్‌లోని శ్రీనిధి ఫుట్‌బాల్ క్లబ్ మైదానాల్లో నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు’ అని చెప్పారు.
కాగా ఈ మెగా ఈవెంట్ నిర్వహణకు డీజీపీ చైర్మన్‌గా వ్యవహరిస్తుండగా, సైబరాబాద్ సీపీ డాక్టర్ ఎం రమేష్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహించనున్నారు. అడ్మినిస్ట్రేషన్ కమిటీలో సీనియర్ ఐపీఎస్ అధికారులు అభి లాషా బిస్త్, అనిల్ కుమార్, సంజయ్ కు మార్ జైన్, వి.సి. సజ్జనార్, అవినాష్ మ హంతి, గజరావు భూపాల్ వంటి వారు వివిధ విభాగాలను పర్యవేక్షించనున్నారు. క్రీడాకారులందరికీ పోలీస్ అకాడమీలో వ సతి సౌకర్యాలు కల్పించడంతో పాటు, 45 ప్రత్యేక బస్సులు, అం బులెన్స్, వైద్య బందాలను అందుబాటులో ఉంచనున్నారు.