12-08-2025 12:00:00 AM
భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 11, (విజయక్రాంతి):కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రామవరం ఇందిరమ్మ కాలనీలో భూములలో జరుగుతున్న నిర్మాణాలపై, జ రుగుతున్న అక్రమ లావాదేవీలపై సమగ్ర విచారణ చేపట్టాలని, భూములను ఆక్రమించుకొని భూదందా చేస్తున్న నాయకులపై చ ర్యలు తీసుకోవాలని జైభీమ్ రావ్ భారత్ పార్టీ (జేబీపీ) స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యె ర్రా కామేష్ జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ను కోరారు. ఈ మేరకు సోమవారం ప్రజావాణి సందర్భంగా పిర్యాదు చేశారు.
తెలం గాణ రాష్ట్ర ఆవిర్భావం కంటే ముందు కాం గ్రెస్ ప్రభుత్వ హయాంలో జీకే ఓపెన్ కాస్ట్ బొగ్గుగని విస్తరణలో భాగంగా 7 ఇంక్లైన్ లో ఇల్లులు కోల్పోయిన సుమారు 1060 మం దికి ఇందిరమ్మ పథకం ద్వారా స్థలాలు కేటాయించడం జరిగిందన్నారు. ఆ తరువాత కాలక్రమేనా నిధులు సరిపడా మంజూరు కాక, సరైన మౌళిక వసతులు లేక నిర్మించుకున్న ఇళ్ళలోకి లబ్ధిదారులు చేరలేదన్నారు. అసంపూర్తిగా వదిలేసిన గృహాలు చాలా ఉ న్నాయన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో ఇందిరమ్మ పథకం రద్దుతో లబ్ధిదారులు గృ హ నిర్మాణాలు చేసుకోక పోవడంతో భూ ములను ఇటీవల కాలంలో కొంత మంది మాజీ ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకులు దళారీల అవతారమెత్తి అమ్మకాలు చే స్తున్నారని ఆరోపించారు. అధికారులు తక్షణమే స్పందించి అక్రమ నిర్మాణాలు, అమ్మ కాలు జరగకుండా చూడాలని, లేని యెడల పార్టీ ఆధ్వర్యంలో పెద్దయెత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ అధ్యక్షుడు నాగుల రవికుమార్, పూణెం మురళి,గజ్జెల శంకర్, సిద్దు తదితరులు పాల్గొన్నారు.