21-05-2025 12:16:38 AM
న్యూఢిల్లీ, మే 20: పార్లమెంటు ఆమోదించిన చట్టాలు రాజ్యాంగబద్ధమైనవని, సమస్యలు ఉంటే తప్ప కోర్టు లు ఆ విషయాల్లో జోక్యం చేసుకోలేవని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టి స్ బీఆర్ గవాయ్ పేర్కొన్నారు. వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం మం గళవారం సుప్రీంకోర్టులో విచారణ జరిపింది.
ఈ సందర్భంగా పార్లమెంట్ ఆమోదించిన చట్టాల్లో సమస్యలు తీవ్రంగా ఉం టేనే కోర్టులు ఆ విషయాల్లో జోక్యం చేసుకుంటాయని జస్టిస్ గవాయ్ స్పష్టం చేశారు. అంతకుముందు కేంద్ర సొలిసిటర్ జనరల్ తుషార్ మెహ తా కేంద్రం తరఫున వాదనలు వినిపించారు. గత బెంచ్ లాగా నే విచారణను మూడు అంశాలకే పరిమితం చేయాలని సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మాసిహ్ ధర్మాసనానికి తెలిపారు.
విచారణలో భాగంగా సుప్రీంకోర్టు ఇది వరకే మూడు అంశాలను గుర్తించిందని తుషా ర్ మెహతా పేర్కొన్నారు. ఆ మూడు అంశాలపై ఇప్పటికే సమాధానం ఇచ్చామని, అయితే తాజాగా పిటిషనర్లు అనేక ఇతర అంశాలను లేవనెత్తారని గుర్తు చేశారు. సుప్రీం లేవనెత్తిన మూడు అంశాలపై ప్రస్తుతం అఫిడవిట్ దాఖలు చేశామని, కేసు విచారణను ఆ మూడు అంశాలకే పరిమితం చేయాలని ఈ సందర్భంగా సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు.
మూడు అంశాలకే పరిమితం చేయడమేంటి?
వక్ఫ్ సవరణ చట్టంపై విచారణను మూడు అంశాలకే పరిమితం చేయాలన్న కేంద్రం వాదనలను పిటిషనర్ల తరఫు న్యాయవాదులు కపిల్ సిబల్, అభిషేక్ మను సింఘ్వి తోసిపుచ్చారు. గతంలో విచారణ సందర్భంగా వక్ఫ్ సవరణ చట్టం కేసును విచారించి మధ్యంతర ఉత్తర్వులపై నిర్ణయం తీసుకుంటామని అప్ప టి సీజేఐ సంజీవ్ ఖన్నా పేర్కొన్నట్టు తెలిపారు.
తాజాగా విచారణను మూడు అం శాలకే పరిమితం చేయడం తగదని అభిషేక్ సింఘ్వి పేర్కొన్నారు. వక్ఫ్ ఆస్తిని ఎటువంటి ప్రక్రియను అనుసరించకుండానే లాక్ చేసుకునే విధంగా చట్టం రూపొందించబడిందని కపిల్ సిబల్ అన్నారు. కనీసం ఐదు సంవత్సరాలుగా ఇస్లాం ఆచరించిన వ్యక్తి మాత్రమే వక్ఫ్‌ను సృష్టించగలరని కపిల్ సిబల్ తన వాదనలో హైలైట్ చేశారు.
వక్ఫ్ సవరణ చట్టం ప్రకారం ఏదైనా గ్రామ పంచాయితీ లేదా ప్రైవేట్ వ్యక్తి ఫిర్యాదు చేయవచ్చని, ఆ ఆస్తిని వక్ఫ్‌గా పరిగణించడం ఆగిపోతుందని కపిల్ సిబల్ స్పష్టం చేశారు. మతపర మైన ఆస్తి పునర్నిర్వచనం గురించి కపిల్ సిబల్ ఇప్పటికే సూచించారని సీనియర్ న్యాయవాది రాజీవ్ ధావన్ పేర్కొన్నారు.
భారత్ సెక్యులర్ భావజాలాలు కలిగిన దేశమని, మెరుగైన నిర్వహణ కోసం కొంతమంది వ్యక్తులు వక్ఫ్ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్నారు. ఈ చట్టం రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన అనేక నిర్ణయాలకు విరుద్ధంగా ఉందని వెల్లడించా రు.
ఇరు వర్గాల వాదనలు విన్నా సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం పార్లమెంట్ ఆమోదించిన చట్టాలు రాజ్యాంగ బద్ధమని, ఆ విషయాల్లో కోర్టు తలదూర్చదని మరోసారి స్పష్టం చేశారు. మూడు గంటల 45 నిమిషాల వాదన అనంతరం సుప్రీం ధర్మాసనం విచారణను బుధవారానికి వాయిదా వేసింది.