21-05-2025 01:08:00 AM
ఫీల్డ్ మార్షల్‌గా నియమిస్తూ ఉత్తర్వులు
ఇస్లామాబాద్, మే 20: భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో పాక్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్‌ను ఫీల్డ్ మార్షల్‌గా ప్రమోట్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆసిమ్ మునీర్‌ను ఫీల్డ్ మార్షల్‌గా ప్రమోట్ చేయాలనే నిర్ణయానికి ప్రధాని షెహబాజ్ షరీఫ్ అధ్యక్షతన జరిగిన పాకిస్థాన్ ఫెడరల్ క్యాబినెట్ భేటీలో ఆమోద ముద్ర వేసింది.