09-09-2025 08:36:44 PM
బాన్సువాడ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని 16వ వార్డు వార్డు సిద్ధిగలికి చెందిన మెరుగు పద్మ ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి మంగళవారం మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నార్ల సురేష్ చేతుల మీదుగా భూమి పూజ చేసి ముగ్గు వేసి ఈ సందర్భంగా నార్ల సురేష్ మాట్లాడుతూ ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆగ్రోస్ ఇండస్ట్రీ చైర్మన్ కాసుల బాలరాజ్ ల ఆదేశాలతో ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. బాన్సువాడ పట్టణంతోపాటు నియోజకవర్గంలో నిరుపేదలందరికీ సొంత ఇల్లు లేని కుటుంబాలకు పోచారం శ్రీనివాస్ రెడ్డి కాసుల బాలరాజులు ఇందిర మహిళల మంజూరు చేస్తూ వారి కళలను సహకారం చేస్తున్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ రఫీ, 16వార్డ్ ఇంచార్జ్ నార్ల ఉదయ్, వార్డ్ ప్రత్యేక అధికారి కృష్ణా, లక్ష్మి నారాయణ, లబ్ధిదారులు పాల్గొన్నారు.