09-09-2025 08:56:06 PM
బాన్సువాడ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని కోట గల్లీలో గల కోట దుర్గమ్మ ఆలయంలో మంగళవారం ఆలయ కమిటీ సభ్యులు కాలనీవాసుల సమక్షంలో నూతన ఆలయ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆలయ నూతన అధ్యక్షునిగా పద్మ నరేష్, గౌరవ అధ్యక్షునిగా చిదుర శివకుమార్ ఉపాధ్యక్షులుగా బుడాల సాయిలు, ప్రధాన కార్యదర్శి దాసరి బాలకృష్ణ, సహాయ కార్యదర్శి రాగిరి శ్రావణ్ కుమార్, కోశాధికారిగా పత్తి మహేందర్, సహాయ కోశాధికారిగా డబ్బేధర్ నవీన్ కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకోవడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో మాజీ గౌరవ అధ్యక్షులు పత్తి శ్రీకాంత్, మాజీ అధ్యక్షులు కోటైముల గంగాధర్, రాజా మాజీ అధ్యక్షులు ఉప్పరి లింగం ఆధ్వర్యంలో ఎన్నుకోవడం జరిగింది.