calender_icon.png 10 September, 2025 | 2:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నీటిపారుదల ప్రాజెక్టులపై మంత్రి సమీక్షలో పాల్గొన్న వేముల

09-09-2025 08:40:30 PM

నకిరేకల్ (విజయక్రాంతి): ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలోని అన్ని నీటిపారుదల ప్రాజెక్టులపై ఎర్రమంజిల్ జలసౌధలో మంగళవారం సమీక్షా సమావేశం నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి  ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy), రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కొమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Minister Komatireddy Venkat Reddy) అధికారులు ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలతో, ప్రాజెక్టుల పురోగతిని వారు సమీక్షించారు. జిల్లాలో ఉన్న ప్రాజెక్టుల పనుల స్థితిగతులు, రైతులకు నీటి సరఫరా, సాగునీటి సదుపాయాలు, తాగునీటి అవసరాలపై మంత్రులు అధికారులతో సమగ్రంగా చర్చించారు. నాణ్యతతో, నిర్ణీత కాలవ్యవధిలో పనులు పూర్తి కావాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం పాల్గొని నకిరేకల్ నియోజకవర్గంలో కొనసాగుతున్న నీటిపారుదల ప్రాజెక్టులపైమంత్రులతో, ఉన్నతాధికారులతో చర్చించారు. ధర్మారెడ్డి, బ్రాహ్మణవెల్లంల, అయిటిపాముల ప్రాజెక్టు లకు అవసరమైన నిధులను కేటాయించి త్వరగా పూర్తి చేయాలని ఆయన కోరారు.