calender_icon.png 10 September, 2025 | 2:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

13వ వార్డులో సీసీ రోడ్డు పనులు ప్రారంభించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్

09-09-2025 08:46:03 PM

బాన్సువాడ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని 13వ వార్డు టీచర్స్ కాలనీలో మంగళవారం మాజీ మున్సిపల్ చైర్మన్ గంగాధర్ చేతుల మీదుగా భూమి పూజ చేసి సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. ప్రత్యేక నిధుల కింద మంజూరైన నిధులతో సీసీ రోడ్డు నిర్మాణ పనులను చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు మహమ్మద్ గౌస్  ప్రభుత్వ సలహాదారులు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి(MLA Pocharam Srinivas Reddy), ఆగ్రో చైర్మన్ కాసుల బాలరాజ్ ల దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని అందులో భాగంగానే రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని ఆయన తెలిపారు. త్వరితగతిన పనులు చేపట్టి రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేయాలన్నారు.