09-09-2025 08:59:04 PM
క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్..
కరీంనగర్ (విజయక్రాంతి): క్రైస్తవ మైనారిటీల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలంగాణ క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్(Telangana Christian Minority Finance Corporation) చైర్మన్ దీపక్ జాన్ అన్నారు. మంగళవారం కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో క్రిస్టియన్ మైనారిటీ సంఘాల ప్రతినిధులు ప్రజలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చైర్మన్ దీపక్ జాన్ మాట్లాడుతూ, క్రైస్తవుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. వారు రాజకీయంగా, సామాజికంగా ప్రగతి సాధించాలన్నదే ప్రభుత్వ ఆకాంక్ష అని తెలిపారు. ప్రభుత్వ పథకాలను క్రైస్తవులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. క్రిస్టియన్స్ అందరూ ఐకమత్యంతో మెలగాలని, ప్రభుత్వం కల్పిస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి(District Collector Pamela Satpathy) మాట్లాడుతూ, క్రిస్టియన్ మైనారిటీల సంక్షేమానికి కృషి చేస్తామని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ రకాల పథకాలను అర్హులైన మైనారిటీల కుటుంబాలకు అందజేస్తామని అన్నారు. ఈ సమావేశంలో డిఆర్ఓ, ఇన్చార్జి మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి వెంకటేశ్వర్లు, పాస్టర్లు, క్రిస్టియన్ మైనారిటీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.