calender_icon.png 10 September, 2025 | 2:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజల్లో చైతన్యం నింపిన కాళోజీ

09-09-2025 08:38:32 PM

జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి..

కరీంనగర్ (విజయక్రాంతి): ప్రజాకవి కాళోజీ నారాయణరావు తన కవిత్వం, రచనల ద్వారా ప్రజల్లో చైతన్యం నింపారని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి(District Collector Pamela Satpathy) అన్నారు. మంగళవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో పద్మ విభూషణ్, ప్రజాకవి కాళోజి నారాయణరావు 111వ జయంతి ఉత్సవాలను జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, లక్ష్మీ కిరణ్ కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... కాళోజి తన కవితలు, రచనల ద్వారా ప్రజల్లో స్ఫూర్తి నింపారని, ప్రజా అవసరాల కోసం నిరంతరం కృషి చేశారని అన్నారు. తెలంగాణ భాష, సాహితీ సేవకు అంకితమయ్యారని, అణిచివేత, అన్యాయాలపై ధిక్కారస్వరం వినిపించారని అన్నారు. కాళోజి మార్గాన్ని అనుసరించి ప్రజలకు సేవ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, లక్ష్మీ కిరణ్, రెవెన్యూ డివిజనల్ అధికారి మహేశ్వర్, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.