calender_icon.png 3 January, 2026 | 4:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బర్సె దేవా లొంగుబాటు

03-01-2026 12:44:07 AM

  1. డీజీపీ ఎదుట మరో 15 మందితో కలిసి ఆయుధం వీడిన మావోయిస్టు అగ్రనేత
  2. హిడ్మాకు అత్యంత సన్నిహితుడు.. పీఎల్జీఏ బెటాలియన్.1 చీఫ్ 
  3. దేవాపై రూ.50 లక్షల రివార్డు 
  4. నేడు మీడియా ముందు ప్రవేశపెట్టనున్న డీజీపీ శివధర్‌రెడ్డి 

హైదరాబాద్, సిటీ బ్యూరో జనవరి 2 (విజయక్రాంతి) : మావోయిస్టు పార్టీకి మరో కోలుకోలేని దెబ్బ తగిలింది. దళంలో అత్యం త కీలకమైన వ్యూహకర్తగా, మిలిటరీ ఆపరేషన్లలో తలపండిన మావోయిస్టు అగ్రనేతగా పేరొందిన బర్సె దేవా జనజీవన స్రవంతిలో కలిశారు.

శుక్రవారం హైదరాబాద్‌లో  డీజీ పీ ఎదుట బర్సెదేవా మరో 15 మందితో కలిసి ఆయుధా లు వదిలి లొంగిపోయారు. ఇటీవల మావోయిస్టు టాప్ లీడర్ హిడ్మా మరణించిన నేపథ్యంలో.. ఆయనకు కుడిభుజంగా ఉన్న దేవా లొంగిపోవడం మావోయి స్టు పార్టీని కుదిపేసే పరిణామంగా విశ్లేషకులు భావిస్తున్నారు. 

పదిహేనేళ్లుగా పోరు

ఇటీవల మృతిచెందిన మావోయిస్టు అగ్రనేత హిడ్మాకు బర్సె దేవా అత్యంత సన్నిహితుడు. వీరిద్దరిది ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా పూవర్తి గ్రామమే కావడం విశేషం. బా ల్యం నుంచే వీరి మధ్య సాన్నిహిత్యం ఉంది. సుదీర్ఘంగా 15 ఏళ్ల పాటు వీరిద్దరూ కలిసి దళంలో పనిచేశారు.

మావోయిస్టు పార్టీలో గిరిజన సామాజికవర్గం నుంచి హిడ్మా తర్వా త ఆ స్థాయికి ఎదిగిన మరోకీలక కమాండర్ దేవానే కావడం గమనార్హం. మావోయిస్టు పార్టీలో అత్యంత శక్తివంతమై న, ప్రమాదకరమైన విభాగంగా పేరున్న పీ పుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ బెటాలియన్ నంబర్-1కు దేవా బాధ్యుడిగా వ్యవహరిస్తున్నారు. 

ఆపరేషన్ల అమలులో కీలకంగా..

రెండేళ్ల క్రితమే హిడ్మా స్వయంగా దేవా ను తన బెటాలియన్‌లోకి తీసుకొని కమాండర్‌గా ప్రమోషన్ ఇచ్చినట్లు సమాచారం. హిడ్మా వ్యూహరచనలో, ఆపరేషన్ల అమలు లో దేవా కీలక పాత్ర పోషించే వారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2013 ఝిరాం ఘాటి దాడి కాంగ్రెస్ అగ్రనేతల మరణం సహా భద్రతా బలగాలపై జరిగిన అనేక మెరుపు దాడుల్లో దేవా ప్రత్యక్షంగా పాల్గొన్నారు.

ఆయనపై ప్రభుత్వం రూ. 50 లక్షల భారీ రివార్డును ప్రకటించింది. అలాం టి కీలక నేత లొంగిపోవడం పోలీసు శాఖకు దక్కిన భారీవిజయంగా చెప్పుకోవచ్చు.  హిడ్మా మరణం, ఇప్పుడు దేవా లొంగుబాటుపై ఇప్పటివరకు పార్టీ నుంచి ఎలాంటి  ప్రకటనా రాలేదు. కాగా, లొంగిపోయిన బర్సె దేవా సహా 15 మందిని శనివారం అధికారికంగా మీడియా ముందుకు ప్రవేశపెట్టి పూర్తి వివరాలు వెల్లడించనున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.