05-08-2025 12:56:12 AM
రంగా రెడ్డి, ఆగస్టు 4 (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్‌గా (రెవెన్యూ) కె. చంద్రారెడ్డి సోమవారం బాధ్య తలు స్వీకరించారు. కొంగరకలాన్ లోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదా యంలోని తన చాంబర్‌కు చేరుకుని బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ ఏఓ సునీల్ కుమార్ అదనపు కలెక్టర్ కు స్వాగతం పలికారు.
రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ గా గతంలో అదనపు కలెక్టర్ గా పని చేసిన ఎం.వి.భూపాల్ రెడ్డి ఏసీబీ కేసులో అరెస్ట్ కావడంతో అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ గారికి ఇన్ చార్జి బాధ్యతలు అప్పగించారు. అడిషనల్ కలెక్టర్ ప్రతిమా సింగ్ ప్రస్తుతం మెటర్నిటీ సెలవులో వెళ్లడంతో ప్రభుత్వం హెచ్‌ఎండీఎ బుద్దపూర్ణిమ ప్రాజెక్టు ఓఎస్డీగా పని చేస్తున్న శ్రీ కె.చంద్రా రెడ్డిని రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ గా ప్రభుత్వం ఇటీవలే బదిలీ చేసింది.