05-08-2025 12:54:49 AM
మేడిపల్లి ఆగస్టు 4: మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఫోక్సొ కేసులో రవితేజ(23) అనే నిందితుని రిమాండ్ కు తరలించినట్లు మేడిపల్లి పోలీసులు తెలిపారు. మేడిపల్లి శివారులో నివసించే 17 సంవత్సరాల బాలికను స్నాప్ చాట్ ద్వారా పరిచయం చేసుకున్న అలియాబాద్ కు చెందిన రవితేజ బాలికను లోవర్చుకున్నాడు. గత కొద్ది నెలలుగా బాలిక నివసించే ఇంట్లోనే ఉంటూ లైంగికంగా వేధిస్తున్నాడు. ఈ విషయంపై బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ జరిపామని, నిందితుడిగా తేలిన రవితేజను అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించామని మేడిపల్లి సిఐ గోవిందరెడ్డి తెలిపారు.