calender_icon.png 7 September, 2025 | 8:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎదులాబాద్ చెరువు వద్ద ఏర్పాట్లను తనిఖీ చేసిన అడిషనల్ కలెక్టర్ రాధిక గుప్త

04-09-2025 11:20:28 PM

ఘట్ కేసర్ (విజయక్రాంతి): ఘట్ కేసర్ మున్సిపల్ ఎదులబాద్ లోని చెరువు వద్ద జరుగుతున్న ఏర్పాట్లను జిల్లా అడిషనల్ కలెక్టర్ రాధిక గుప్తా(District Additional Collector Radhika Gupta) గురువారం సాయంత్రం తనిఖీ చేశారు. ఎదులాబాద్ చెరువులో వినాయకుల విగ్రహాల నిమజ్జనానికి చేసిన ఏర్పాట్లను తనిఖీ చేసి, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలన్నారు. మున్సిపల్ కమిషనర్ రాజేష్ మాట్లాడుతూ, 100 మంది శానిటేషన్ సిబ్బంది, త్రాగునీరు, 3 క్రేన్లు, ఎమర్జెన్సీ ఆటో, ఆరుగురు గజ ఈతగాళ్ళు (షిఫ్ట్ 2), మూత్రశాలలు, 23 సీసీ కెమెరాలు, భారీగా పోలీసు బందోబస్తుతో, చెరువు నిమజ్జనం చోట భారీకేడింగ్, గ్రీన్ మెష్ తో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నమని తెలిపారు. నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేశామని భక్తులకు అసౌకర్యం కలిగినచో మున్సిపల్ సిబ్బందికి తెలుపాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ రజిని, మేనేజర్ సతీష్, ఆర్ఐలు సాయిరాం, కావ్య, ఎస్ఐ శేఖర్, ఏఈ రాకేష్, సానిటరీ ఇన్ స్పెక్టర్  వేణుగోపాల్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ రాజేష్, మున్సిపల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.