calender_icon.png 7 September, 2025 | 7:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వంద పడకల ఆసుపత్రి పనులను పరిశీలించిన ప్రభుత్వ విప్

07-09-2025 01:00:20 AM

మరిపెడ,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం మున్సిపాలిటీలో వందపాటుకు ఆసుపత్రి నిర్మాణాన్ని శుక్రవారం సంబంధిత అధికారులతో కలిసి డోర్నకల్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్ర నాయక్ పరిశీలించడం జరిగింది. మరిపెడ పట్టణ కేంద్రంలో ప్రభుత్వ విప్ డోర్నకల్ శాసనసభ సభ్యులు డా.జాతోటు రామచంద్రు నాయక్, మహబూబాబాద్ జిల్లా పార్లమెంటు సభ్యులు పోరిక బలరాం నాయక్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మరిపెడ ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్శనలో భాగంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ,   ఆరోగ్య సిబ్బంది హాజరు, రోగులకు అందిస్తున్న వైద్యసేవలు, మందుల లభ్యత, ల్యాబ్ సదుపాయాలు, టీకాల పంపిణీ, స్టాక్ రిజిస్టర్లు తదితర అంశాలను సవివరంగా పరిశీలించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 3నెలలకు సరిపడా మందులను ఆరోగ్య కేంద్రంలో అందుబాటులో ఉంచాలని కోరారు .అలాగే, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజారోగ్య చర్యలు ఎంతవరకు అమలవుతున్నాయి అన్నది సమీక్షించారు.వర్షాకాలంలో మలేరియా, డెంగ్యూ, వైరల్ ఫీవర్స్ వంటి వ్యాధుల నివారణకు ప్రజల్లో అవగాహన పెంపు చాలా ముఖ్యం అని తెలిపారు.

ప్రతి ఇంటికి శానిటేషన్, శుభ్రమైన తాగునీటి సరఫరా, దోమల నియంత్రణ చర్యలను విస్తృతంగా చేపట్టాలని సూచించారు.గ్రామాలలో గృహసందర్శనల ద్వారా వైద్య సిబ్బంది ప్రజల ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్య సిబ్బందితో సమీక్ష సమావేశం జరిపినారు. అదేవిధంగా ఆరోగ్య శాఖ అందించే సేవలను ప్రతి పౌరునికి చేరవేయడం ప్రభుత్వ ప్రధాన కర్తవ్యమని ఆయన పునరుద్ఘాటించారు.