4 August, 2026 | 4:21 PM

నిత్యావసర సరుకులు అందజేత

04-08-2026 03:17 PM

లక్షేట్టిపేట,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా లక్షేట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని నిరుపేద కుటుంబాలకు రూ. 3 వేల విలువైన నిత్యవసర సరుకులను రావుల అంజన్న, సుజాత దంపతులు మంగళవారం అందజేశారు. తమ మనుమల జన్మదినం సందర్భంగా సత్యసాయి నగర్, ఇటిక్యాలకు చెందిన రెండు నిరుపేద కుటుంబాలకు శ్రీ సత్య సాయి సేవా సమితి ప్రేరణతో నిత్యవసర సరుకులు అందజేసినట్లు తెలిపారు. సమాజంలో ప్రతి ఒక్కరూ తమ వంతుగా తోటి వారికి వీలైనంత సహకరించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సత్య సాయి సేవా సమితి కార్యకర్త రామ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.