10-07-2025 10:54:36 PM
ఒకరి అరెస్టు, బైక్ స్వాధీనం..
కామారెడ్డి (విజయక్రాంతి): గంజాయి ప్యాకెట్లు తయారుచేసి విక్రయిస్తున్నట్లు సమాచారం అందుకున్న ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు(Task Force Police) గురువారం కామారెడ్డి పట్టణ పరిధిలోని పాత రాజంపేట రైల్వే గేట్ వద్ద పట్టుకున్నారు. అతని వద్ద నుంచి 550 గ్రాముల గంజాయి ప్యాకెట్లు, ఒక బైకును స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ సుందర్ సింగ్, సబ్ ఇన్స్పెక్టర్ శరత్ కుమార్, ఎక్సైజ్ కానిస్టేబుల్ సిబ్బంది పాల్గొన్నారు.