11-02-2025 12:00:00 AM
కరింనగర్, ఫిబ్రవరి10 (విజయక్రాంతి): కరీంనగర్ నగరంలోని ముకరంపురలో గల సమీకృత సంక్షేమ బాలుర గృహ సముదాయములో అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయి రాత్రి బస చేశారు. విద్యర్థులకు అందిస్తున్న ఫుడ్ మెనూ, వంటశాలను పరిశీలించారు. విద్యార్థుల కో సం స్వయంగా వంట చేశారు. ఆలూ కుర్మా, సేమియా పాయసం చేసి విద్యార్థులకు వడ్డించారు. వారితో కలిసి భోజనం చేశారు.
విద్యాభోదనపై విద్యార్థులను అడిగితెలుసుకున్నారు. సంక్షేమ వసతి గృహాల అధికారులు నెలకు ఒకసారి హాస్టల్, రెసిడెన్షియల్ పాఠశాలలను సందర్శించా లని సూచించారు. తనిఖీలు చేయడం వల్ల పిల్లలకు మనోధైర్యం పెరుగుతుందని, ఏ సౌకర్యాలు అవసరమో తెలుస్తుందని అన్నారు. నూతన మెనూ ప్రకారం భోజనం తయారు చేసేందుకు నాణ్యమైన వస్తువులను వినియోగించుకోవాలని సూచించారు.
బాలుర గృహంలో కేర్ టేకర్ లు భోజనం వండే సమయాలలో, విద్యార్థులు భోజనం చేసే సమయాలలో కిచెన్ షెడ్, డైనింగ్ హాల్ లలో ఉండాలని సూచించారు. వంట వండే సిబ్బంది చూసి శుభ్రతతో ఉండాలని సూచిం చారు. డైనింగ్ హాల్ , కిచెన్ షెడ్ పరిశుభ్రత పాటించాలని, లేనిపక్షంలో కఠిన చర్యలు తీసుకోను న్నట్లు తెలిపారు. అనంతరం బాలుర వసతిగృహంలో విద్యార్థులతో కలిసి హాస్టల్లోనే నిద్రించా రు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సంక్షేమ శాఖ ఈడి నాగార్జున, జిల్లా యూత్ కోఆర్డినేటర్ రాంబాబు పాల్గొన్నారు.