26-07-2025 12:24:26 AM
బూర్గంపాడు,జూలై 25,(విజయక్రాంతి): మండలంలోని మోరంపల్లి బంజర ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని అడిషనల్ డిఎంహె చ్‌ఓ డాక్టర్ సైదులు శుక్రవారం సందర్శించారు.ఈ సందర్భంగా ఆయన ఆస్పత్రిలోని రికార్డులను,ల్యాబ్ ను,మందులను పరిశీలించారు.
వైద్య సిబ్బంది అందుబాటులో ఉండి ప్రజలకు వైద్యం అందించాలని సూచించా రు.అనంతరం ఆసుపత్రి ఆవరణలో మొక్క ను నాటారు.ఈ కార్యక్రమంలో డిడిఓ పి. స్పందన,డాక్టర్ యం.లక్ష్మీ సాహితి,డాక్టర్ బి. జయ, మెడికల్ ఆఫీసర్ ఆయుర్వేదిక్, హెల్త్ సూపర్వైజర్ రమణ, టి.వి.రామనరసయ్య, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.