26-07-2025 12:26:35 AM
ఖమ్మం, జులై 25 (విజయ క్రాంతి): సొంత స్థలం ఉండి అర్హులైన ప్రతి పేదవాడు సొంతంగా ఇల్లు నిర్మించుకోవాలనే కలను కాంగ్రెస్ ప్రభుత్వం నిజం చేయబోతుందని 24వ డివిజన్ కార్పొరేటర్ కమర్తపుమురళి అన్నారు. ఖమ్మం లో శుక్రవారం అయన 15 మంది లబ్ధిదారులకు ప ట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి అభయహస్తంలో భాగంగా ఇందిరమ్మ ఇండ్ల పథకం క్రింద మంత్రి తుమ్మల కృషి తో కొత్తగా ఇల్లునిర్మిచుటకు రూ.5,00,000/- ఆర్థిక సహాయం (పూర్తి సబ్బిడితో ) మంజూరు చేయడమైనదన్నారు .
ఈ మంజూరు ఉత్తర్వులు అందిన 45 రోజుల లోపు ఇంటి నిర్మాణము పనిని మొదలు పెట్టి సంవత్సరములోపు ఇంటిని పూర్తి చేసుకోవాలని , ఇంటి నిర్మాణము 400 చదరపు అడుగుల వి స్తీర్ణము తగ్గకుండా 600 చదరపు అడుగులకు మించకుండా ఆర్ సి సి స్లాబుతో నిర్మించుకోవాలన్నారు. రెండు గదులతో పాటు వంట గది , మరుగుదొడ్డి తప్పనిసరిగా నిర్మించాలి , తదు పరి లబ్దిదారుడు అనర్హతగా తేలినా ,
నిభందనలకు విరుద్దముగా ఇల్లు నిర్మించినట్టు తేలినా ఇం టి మంజూరును రద్దు చేస్తూ అప్పటి వరకు చెల్లించిన బిల్లుల మొత్తము . ఆర్.ఆర్ చట్ట ప్రకారము తిరిగి వసూలు చేయబడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గంగిశెట్టి శ్రీనివాస్ , షేక్ గౌస్ , నాగాటి చంద్రశేఖర్ , రేఖ లక్ష్మణ్ , వరద వెంకన్న ,సురపనేని సురేష్, పోలూరి నాగార్జు న , మునిశెట్టి మహేష్ , సూరపనేని సురేష్ , మహిళా నాయకురాలు రేఖ భార్గవి , మరికంటి అను ష , జోయ , పొనుగోటి స్వప్న తదితరులు పాల్గొన్నారు .