29 March, 2026 | 2:24 AM

ఆదిలాబాద్ జిల్లా నేతల చేరికకు బ్రేక్

04-05-2024 01:13 AM

హైదరాబాద్, మే 3 (విజయక్రాంతి): పార్లమెంట్ ఎన్నికల ముందు ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వలసలు ఊపందుకున్నాయి. ఇందులో భాగంగానే ఆదిలాబాద్ జిల్లాకు చెందిన నాయకుల చేరిక తాత్కలికంగా నిలిపివేసినట్లు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. డీసీసీ మాజీ అధ్యక్షులు సాజిద్‌ఖాన్, నాయకులు గండ్ర సుజాత, సంజీవరెడ్డి చేరికల కమిటీ సభ్యులు జగ్గారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. అధిష్ఠానం సూచనల మేరకు చేరికలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు జగ్గారెడ్డి తెలిపారు. ఎన్నికల ముందు కాంగ్రెస్‌ను వీడి.. పార్టీ ఓటమికి కారణమైన వారిని ఎలా చేర్చుకుంటారని ఆదిలాబాద్ జిల్లా నేతలు అభ్యంతరం వ్యక్తం చేయడంతోనే  చేరికల నిర్ణయాన్ని నిలిపివేసినట్లుగా సమాచారం.